అమరావతి: రాష్ట్ర శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది. రెండు రోజుల పాటు సమావేశమైన శాసనసభ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం నిరవధికంగా వాయిదా వేశారు. ఎన్‌ఆర్‌పీ, ఎన్‌పిఆర్ సవరణ బిల్లులను కూడా శాసనసభ ఆమోదించింది. ఇక మొత్తం 5 గంటల 58 నిముషాల పాటు విధులు నిర్వహించిన శాసన సభలో 13 బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, మొత్తం 15 బిల్లులకు ఆమోదాన్ని తెలిపింది. ఇక చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ కు సంతాపం తెలిపిన అసెంబ్లీ, బడ్జెట్, గవర్నర్ ప్రసంగాలపై ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదం తెలుపింది. ఈసారి స్వల్పకాలిక చర్చలు, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ చర్చలు లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.
June 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు...15 బిల్లుల ఆమోదం
Rating: 5
Reviewed By: NEWS UPDATE

