చిలకలూరిపేట: స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాజా బడ్జెట్‌లో కేవలం సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం రూ.41,456 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ మొత్తంలో ఏకంగా రూ.25,456 కోట్లు కేవలం బీసీలకే కేటాయించారని చెప్పారు. ఇందులో ముస్లిం మైనారిటీ సంక్షేమం కోసం రూ.1998 కోట్లు, బీసీల కోసం రూ.23453 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇంత మొత్తంలో గతంలో ఏ ప్రభుత్వాలు కూడా బీసీల కోసం కేటాయించలేదని వెల్లడించారు. గతేడాది బీసీలకు తమ ప్రభుత్వం ఏకంగా రూ.15061 కోట్లు కేటాయించగా... ఈ ఏడాది ఏకంగా 68.18 శాతం అదనంగా నిధులను తమ ప్రభుత్వం బీసీలకు వెచ్చించనుందని వివరించారు.
రాష్ట్రంలో బీసీల లోగిళ్లు ఇకపై ఆనందంగా ఉండబోతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు కనీవిని ఎరుగని విధంగా నిధులు వారి బ్యాంకు ఖాతాలకే రాబోతున్నాయని చెప్పారు. తాజా బడ్జెట్‌లో వైఎస్సార్ పింఛన్ కానుక కింద ఒక్క బీసీలకే రూ.10,315 కోట్లు, వైఎస్సార్ ఆసరా పథకం కింద ఒక్క బీసీలకే రూ.4217 కోట్లు, అమ్మ ఒడి కింద బీసీలకు రూ.3358 కోట్లు, వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1693 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద రూ.1868 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.1240 కోట్లు, వైఎస్సార్ వాహన మిత్ర కింద రూ.134 కోట్లు, జగనన్న తోడు కింద రూ.60 కోట్లు, జగనన్న చేదోడు కింద రూ.197కోట్లు, వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.196కోట్లు, లా నేస్తం పథకం ద్వారా బీసీలకు రూ.60 కోట్లు, మత్స్యకార భరోసా రూ.108 కోట్లు, ఇతర పథకాల ద్వారా మరో రూ.9కోట్లు మొత్తం కలిపి ఈ ఏడాదికిగాను రూ.23,458 కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం ఖర్చు చేయబోతోందన్నారు. ఆయా పథకాల కింద ముస్లిం, మైనారిటీలకు రూ.1998 కోట్లు వెచ్చించబోతుండటం తమకు గర్వకారణమని తెలిపారు. బీసీలను ఇప్పటివరకు కష్టాలు చుట్టుముట్టాయని, ఇకపై నిధులు వెల్లువెత్తబోతున్నాయని వివరించారు.