♦️అక్రమంగా వ్యాపారం చేయాలి.. డబ్బు సంపాదించాలి.. లాక్ డౌన్ను ఎలాగైనా క్యాష్ చేసుకోవాలి అని ఆలోచించారు చిలకలూరిపేటకు చెందిన అంబులెన్స్ నిర్వాహకులు.
♦️చిలకాలూరిపేట పట్టణంలోని ఒక ప్రముఖ హాస్పిటల్ నుండి పేషెంట్లను తరలించే అంబులెన్స్ నిర్వాహకులు అంబులెన్స్ లో మధురై నుండి మద్యం తీసుకొస్తూ పెద్దాపురం వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. ఆ అంబులెన్స్లో 107 ఫుల్ మద్యం బాటిళ్లు పట్టుకున్న పోలీసులు, వారిపై కేసు నమోదు చేశారు.
♦️అయితే చిలకలూరిపేటకు చెందిన ఈ ముగ్గురు యువకులు గత మూడు నెలల నుండి అక్రమంగా ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెస్తూ చిలకలూరిపేటలో విక్రయిస్తున్నారు. పోలీసులకు తమ ప్రాంతం నరసరావుపేటగా చెప్పుకొచ్చారు.
♦️అయితే వీరు చిలకలూరిపేటలో హాస్పిటల్స్ నుండి అత్యవసరంగా పేషెంట్లను గుంటూరు తదితర ప్రాంతాలకు తరలిస్తూ లాక్డౌన్ వల్ల అంబులెన్సుతో డబ్బు సంపాదించ వచ్చని అత్యాశతో లాక్ డౌన్లో ఇదే వాహనంలో ఇతర రాష్ట్రాలకు జనాన్ని ఎమర్జెన్సీగా తీసుకెళ్లి వారి వద్ద వేలకు వేల రూపాయలు తీసుకుని వచ్చేటప్పుడు మద్యం తీసుకువచ్చి చిలకలూరిపేట, తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు.
♦️అయితే ఎప్పటికైనా అక్రమంగా చేసే వ్యాపారం దాగదు కదా... గత మూడు నెలల నుండి అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న. వీరు చిలకలూరిపేట అధికారుల నుండి తప్పించుకొని పెద్దాపురం అధికారులకు చిక్కారు.
