728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 17, 2020

చైనాతో ఘర్షణలో అమరులైన సైనికులు వీరే

న్యూఢిల్లీ: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య మంగళవారం జరిగిన ముఖాముఖి ఘర్షణలో వీర మరణం పొందిన 20 మంది సైనికుల పేర్లను భారత ఆర్మీ బుధవారం విడుదల చేసింది. అమరులైన సైనికుల్లో బీహార్‌కు చెందిన ఐదుగురు, పంజాబ్‌కు చెందిన నలుగురు, జార్ఖండ్‌, ఒడిశా నుంచి ఇద్దరు చొప్పున, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి ఒక్కరు చొప్పున ఉన్నారు. లేహ్‌లోని ఆర్మీ దవాఖాన వద్ద వారి భౌతిక కాయాలకు నివాళి అర్పించిన అనంతరం సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చైనాతో ఘర్షణలో అమరులైన సైనికులు వీరే..

1. కర్నల్‌ బి సంతోష్ బాబు (తెలంగాణ)

2. నాయబ్ సుబేదార్ నుదురం సోరెన్ (ఒడిశా)

3. నాయబ్ సుబేదార్ మన్‌దీప్ సింగ్‌ (పంజాబ్‌)

4. నాయబ్ సుబేదార్ సత్నం సింగ్ (పంజాబ్‌)

5. హవల్దార్‌ కె పళని (తమిళనాడు)

6. హవల్దార్‌ సునీల్ కుమార్‌ (బీహార్‌)

7. హవల్దార్‌ బిపుల్ రాయ్ (ఉత్తరప్రదేశ్‌)

8. నాయక్ దీపక్ కుమార్ (మధ్యప్రదేశ్‌)

9. సిపాయి రాజేష్ ఒరాంగ్ (పశ్చిమ బెంగాల్‌)

10. సిపాయి కుందన్ కుమార్ ఓజా (జార్ఖండ్‌)

11. సిపాయి గణేష్ రామ్ (ఛత్తీస్‌గఢ్‌)

12. సిపాయి చంద్రకాంత ప్రధాన్ (ఒడిశా)

13. సిపాయి అంకుష్ (హిమాచల్‌ ప్రదేశ్‌)

14. సిపాయి గుర్బిందర్ (పంజాబ్‌)

15. సిపాయి గుర్తేజ్ సింగ్ (పంజాబ్‌)

16. సిపాయి చందన్ కుమార్ (బీహార్‌)

17. సిపాయి కుందన్ కుమార్ (బీహార్‌)

18. సిపాయి అమన్ కుమార్ (బీహార్‌)

19. సిపాయి జై కిషోర్ సింగ్ (బీహార్‌)

20. సిపాయి గణేష్ హన్సాద్‌ (జార్ఖండ్‌)
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చైనాతో ఘర్షణలో అమరులైన సైనికులు వీరే Rating: 5 Reviewed By: NEWS UPDATE