అమరావతి: కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేట్ ల్యాబ్‌లకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ కోవిడ్ పరీక్ష ఫీజును రూ.2,900గా నిర్ణయించింది. అయితే ఏపీలో కనీస ప్రమాణాలు పాటించకుండా ల్యాబ్‌ల నిర్వహణ ఉండటంపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వాసుపత్రి రిపోర్టులో పాజిటివ్ అని ఉండగా, ప్రైవేటు ల్యాబ్ రిపోర్టులో నెగిటివ్ అని తేలింది. నలుగురు వ్యక్తులకు ఇదే విధంగా రావడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ ఎదుట బాధితులు నిరసనకు దిగారు. ల్యాబ్‌పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
June 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: కరోనా: ప్రభుత్వాస్పత్రిలో పాజిటివ్.. ప్రైవేటు ల్యాబ్‌లో నెగిటివ్.. ఏపీలో ఆందోళన
Rating: 5
Reviewed By: NEWS UPDATE

