చిలకలూరిపేట: ఈ నెల18వ తేదీ నుంచి చిలకలూరిపేట పట్టణ మరియు మండల ప్రాంతంలోని అన్ని రేషన్ డిపోల్లో బియ్యం ఉచితంగా ఇస్తున్నట్లు తహసిల్దార్ లక్ష్మీ ప్రమీల తెలియజేశారు. ఈ సరుకులకు సంబంధించి కూపన్ల ద్వారా పొందవచ్చని అన్నారు.
చిలకలూరిపేట ప్రాంతంలో సుమారు 50 నుండి 60 వేల మంది వరకు ఈ కేవైసీ చేయించుకో లేదని వెంటనే వారు ఈ కేవైసీ చేయించుకోవాలని తెలియజేశారు.
కొత్త రేషన్ కార్డు, రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు, పొందలన్నా ఇక నుంచి ఐదు సేవలు వార్డు సచివాలయం, గ్రామ సచివాలయాలు ద్వారా పొందవచ్చని తహసిల్దార్ తెలిపారు.
