728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 19, 2020

బీఆర్ జీ పాఠ‌శాల‌లో నాడు- నేడు ప‌నులను ప‌రిశీలించిన ఎమ్మెల్యే రజిని

చిలకలూరిపేట: ప‌ట్ట‌ణంలోని భార‌త‌ర‌త్న ఇందిరాగాంధీ హైస్కూల్ లో జ‌రుగుతున్న నాడునేడు ప‌నుల‌ను శుక్ర‌వారం ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ నాడు- నేడు ప‌నుల కోసం గ‌డిచిన రెండు వారాల్లో క‌లిపి మొత్తం రూ.62.79 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సి ఉండ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కు 61.45 ల‌క్ష‌లు వెచ్చించ‌గ‌లిగామ‌ని తెలిపారు. మొత్తం 94.72 శాతం నిధులు ఖ‌ర్చు చేసి రాష్ట్రంలోనే చిల‌క‌లూరిపేట మున్సిపాలిటీ మొద‌టిస్థానంలో నిలిచింద‌ని ఆనందం వ్య‌క్తంచేశారు. త‌మ మున్సిపాలిటీకి ద‌గ్గ‌ర‌లో మ‌రే మున్సిపాలిటీ లేద‌ని వెల్ల‌డించారు. ఇదంతా తాము చేస్తున్న నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌, అధికారుల క‌ష్టం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని తెలిపారు. ఇది త‌మ‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఈ విష‌యంలో తాను మున్సిప‌ల్ అధికారుల‌ను ఎంత‌గానో అభినందిస్తున్నాన‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సీహెచ్ శ్రీనివాస‌రావు, డీఈ అబ్ధుల్ ర‌హీమ్ మాట్లాడుతూ ఇసుక కొర‌త వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని చెప్పారు. 858 ట‌న్నుల ఇసుక కోసం తాము ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఇప్ప‌టివ‌ర‌కు 282 ట‌న్నుల ఇసుక మాత్ర‌మే వ‌చ్చింద‌ని, 548 ట‌న్నుల ఇసుక ఇంకా రావాల్సి ఉంద‌ని వెల్ల‌డించారు. ఇసుక వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్త‌కుండా తాము ప్ర‌త్యామ్నాయ మార్గాలను అనుస‌రించామ‌ని చెప్పారు. ఈ స‌మ‌స్య లేకపోతే ప్ర‌భుత్వ నిధుల‌తో సంబంధం లేకుండా నాడు-నేడు ప‌నుల‌ను వెనువెంట‌నే పూర్తిచేస్తామ‌ని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇసుక కొర‌త లేకుండా తాను బాధ్య‌త తీసుకుంటాన‌ని చెప్పారు. జేసీతో మాట్లాడి.. వెంట‌నే ఇసుక వ‌చ్చేలా ఏర్పాట్లు చేస్తాన‌న్నారు. బీఆర్ ఐజీ పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న ప‌నుల‌న్నింటినీ ప‌రిశీలించి సంతృప్తి వ్య‌క్తంచేశారు. పాఠ‌శాల‌లో పార్కింగ్ స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ప‌ఠాన్ త‌ల్హాఖాన్‌, పార్టీ ప‌ట్ట‌ణ మైనారిటీ సెల్ అధ్య‌క్షుడు బేరింగ్ మౌలాలి, ప‌ట్ట‌ణ కార్య‌ద‌ర్శి బి.నాగ‌రాజు, పార్టీ  36, 37 వార్డుల నుంచి కౌన్సిల‌ర్లుగా బ‌రిలో ఉన్న బత్తుల ఇందిరా,కిలారు రేవతి,పార్టీ నాయకులు శివ‌ప్ర‌సాద్‌, గ‌ణేష్‌, అశోక్‌కుమార్‌, ఇత‌ర నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, మున్సిప‌ల్ అధికారులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బీఆర్ జీ పాఠ‌శాల‌లో నాడు- నేడు ప‌నులను ప‌రిశీలించిన ఎమ్మెల్యే రజిని Rating: 5 Reviewed By: NEWS UPDATE