728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 24, 2020

బ్యాంక్ ఖాతాదారులకు ఝలక్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్..!

న్యూఢిల్లీ:
★ బ్యాంక్ ఖాతాలు ఉన్న‌వారంరికీ ఓ ముఖ్య‌మైన అల‌ర్ట్ వ‌చ్చింది.

★ జులై నుంచి బ్యాంక్‌కు సంబంధించిన చాలా అంశాల్లో మార్పులు రాబోతున్నాయి.

★ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ దగ్గరి నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ వరకు పలు అంశాల్లో మార్పులు సంభ‌వించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

★ దీంతో బ్యాంక్ కస్టమర్లపై డైరెక్ట్ గానే ఎఫెక్ట్ ప‌డ‌నుంది.

★ జూలై 1 నుంచి మారబోతున్న బ్యాంక్ రూల్స్ ఏంటో ఇక్క‌డ తెలుసుకోండి.

★ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది.

★ సేవింగ్స్ ఖాతాల‌పై వడ్డీ రేట్లను 0.5 శాతం తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

★ ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమలులోకి రానున్న‌ట్లు తెలి‌పింది.

★ దీంతో వచ్చే నెల నుంచి బ్యాంక్ ఖాతాదారులకు గరిష్టంగా 3.25 శాతం వరకు ఇంట్రస్ట్ లభిస్తుంది.

★ కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో విధించిన‌ లాక్ డౌన్ వల్ల ఏటీఎం క్యాష్ విత్‌డ్రాపై చార్జీలు తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విష‌యం తెలిసిందే. అయితే వచ్చే జులై నుంచి ఈ సౌల‌భ్యం అందుబాటులో ఉండకపోవచ్చు.

★ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 3 నెలలు వరకు మాత్రమే చార్జీల మినహాయింపు ఉంటుంద‌ని తెలిపిన నేప‌థ్యంలో.. ఇవి మళ్లీ వచ్చే నెల నుంచి అమలులోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

★ ఇక‌ బ్యాంకు క‌స్ట‌మ‌ర్స్ కు వచ్చే నెల నుంచి మరో ఝలక్ కూడా తగలనుంది.

★ నిర్మలా సీతారామన్ గతంలో బ్యాంక్ అకౌంట్ల‌పై మినిమమ్ బ్యాలెన్స్ చార్జ‌స్ కూడా తొల‌గిస్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు.

★ అయితే ఈ బెనిఫిట్ కూడా 3 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్ల‌డించారు.

★ దీంతో జులై నుంచి మళ్లీ మినిమమ్ బ్యాలెన్స్ నిబంధ‌న‌లు అమలులోకి వస్తాయి.

★ దీంతో మళ్లీ చార్జీలు బాదుడు స్టార్ట్ అవుతుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బ్యాంక్ ఖాతాదారులకు ఝలక్.. జూలై 1 నుంచి కొత్త రూల్స్..! Rating: 5 Reviewed By: NEWS UPDATE