728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 30, 2020

నేడు సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

న్యూఢిల్లీ: భారత్-చైనా మధ్య నేడు కమాండర్ స్థాయి చర్చలు, నేటితో ముగియనున్న అన్‌లాక్-1. ప్రధాని ప్రసంగంపై ఆసక్తి భారత ప్రధాని నరేంద్రమోదీ నేటి సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్-చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, చైనాకు చెందిన 59 యాప్‌లపై ప్రభుత్వం నిన్న రాత్రి నిషేధం విధించింది. అలాగే, నేటి ఉదయం భారత్-చైనా మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రజలకు ఏం చెప్పబోతున్నారన్న దానిపై  అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, నేటితో అన్‌లాక్-1 ముగియనున్న నేపథ్యంలో అన్‌లాక్-2కు సంబంధించి మోదీ మాట్లాడే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేడు సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ Rating: 5 Reviewed By: NEWS UPDATE