చిలకలూరిపేట:
♦️చిలకలూరిపేట పురపాలక సంఘంలో నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్, మాంసం చేపలు, సండ్రికు చెందిన వేలం పాట మంగళవారం ప్రారంభమైన కొద్ది సేపటికే అర్థాంతరంగా వాయిదా వేసి వెళ్లిపోయారు మున్సిపల్ రెవెన్యూ అధికారి.
♦️ఈనెల 23వ తేదీన ఒక పత్రికలో ROC నెంబర్ 564/20 20/ ఎ2తో టెండర్ వేలం ప్రకటన ప్రకటించారు.
♦️అయితే ఇందులో చంద్రమౌళి కూరగాయల మార్కెట్, మాంసం చేపలు, సండ్రీ మార్కెట్ ఫీజుల వసూళ్లకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు 29వ తేదీ సాయంత్రం నాలుగు గంటలలోపు సాల్వేన్సీ సర్టిఫికేట్ సంబంధిత డాక్యుమెంట్లు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించ వలసిందిగా తెలియజేస్తూ, 30 తేదీన ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయం ప్రకటన ఒక పత్రికలో విడుదల చేశారు.
♦️కాగా మంగళవారం 30 తేదీ మున్సిపల్ కార్యాలయంలో 11.15 నిమిషాలకు వేలంపాట ప్రారంభమైంది. మొదటగా మాంసం, చేపలుకు సంబంధించి ధరావతు తీసుకొని మున్సిపల్ అధికారులు 9 నెలలకు ఒక లక్ష 39 వేల రూపాయలు ప్రభుత్వ నిర్ణయించిన పాటను ప్రారంభించారు. ఈ పాట 1,55,500 రూపాయలకు ఒక వ్యక్తి పాడుకున్నారు. అనంతరం అందరి వద్ద సంతకాలు తీసుకుని వెంటనే కూరగాయల మార్కెట్ పాట దారులను పిలువ వలసిందిగా రెవెన్యూ అధికారి తెలియపరిచారు.
♦️ఇది చెప్పిన నిమిషానికి రెవెన్యూ ఆఫీసర్ పాటలన్ని వాయిదా వేస్తున్నట్లు, మూడు పాటలు రద్దు చేస్తున్నట్లు తెలియజేసి వెళ్ళిపోయారు.
♦️అయితే 23 వ తేదీన ప్రకటించిన బహిరంగ వేలం ప్రకటనలో ఈ టెండరు ప్రకటన పూర్తిగా రద్దు చేయడం గాని, నిలిపివేయడం గాని మున్సిపల్ కార్యాలయ అధికారికి హక్కు ఉన్నట్లు ఆ ప్రకటనలో తెలియజేయలేదు. కానీ ప్రకటనలో తెలియజేయకుండా పాటలు నిర్వహిస్తూ ఒక మాసం, చేపల పాటను పెట్టిన తర్వాత రెండు పాటలు పెట్టకుండా మూడు పాటలను నిలుపుదల చేయడం ఏమిటని పాటకు వచ్చినవారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
♦️పాట నిలుపుదల చేసేవారు ముందుగా తెలియ చేయాలని తాము సర్టిఫికెట్లు తీసుకొని అప్పోసప్పో చేసి డబ్బులు డిపాజిట్ చేసి సాల్వేన్సీ తెచ్చామని, ఉదయం నుంచి ఇక్కడ ఉండగా మధ్యాహ్నానికి ఒక పాట నిర్వహించి, అన్ని రద్దుచేసామని చెప్పడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
♦️ఈ విషయాలపై వివరణ కొరకు రెవెన్యూ అధికారిని సంప్రదించడానికి ప్రయత్నించగా రెవిన్యూ అధికారి కార్యాలయంలో అందుబాటులో లేరు. సదరు అధికారిను ఫోన్ ద్వారా సంప్రదించడానికి అనేకమార్లు ప్రయత్నించగా సదరు అధికారి ఫోన్ కూడా తీయకపోవడంతో పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు.