728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 30, 2020

కరోనా కేసుల్లో చైనాను దాటిన మూడు రాష్ట్రాలు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉనికికి కేంద్రమైన చైనాను మన దేశంలోని మూడు రాష్ట్రాలు దాటాయి. ఆ దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్యను ఇప్పటికే ముహారాష్ట్ర అదిగమించగా తాజాగా తమిళనాడు, ఢిల్లీ కూడా ఆ సరసన చేరాయి. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5.6 లక్షలకు చేరింది. ప్రపంచ దేశాల్లో భారత్‌ నాలుగో స్థానంలో ఉన్నది.

మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,257 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 1,69,883 సంఖ్యతో ఆ రాష్ట్రం తొలిస్థానంలో కొనసాగుతున్నది. కరోనా వల్ల మహారాష్ట్రలో ఇప్పటి వరకు 7,610 మంది మరణించారు. కాగా, తమిళనాడు మరోసారి రెండో స్థానానికి చేరింది. ఆ రాష్ట్రంలో మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 86,224కు చేరగా 1,141 మంది చనిపోయారు.

ఇక సోమవారం వరకు రెండో స్థానంలో ఉన్న ఢిల్లీలో గత 24 గంటల్లో 2,084 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,161కు పెరిగి  ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నది. ఢిల్లీలో వైరస్‌ బారినపడి 2,680 మంది మరణించారు. చైనాలో ఇప్పటి వరకు మొత్తం 83,531 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యను మహారాష్ట్రతోపాటు తమిళనాడు ఇప్పటికే అదిగమించగా తాజాగా ఢిల్లీ కూడా దాటింది. దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో మూడొంతులు ఈ మూడు రాష్ట్రాల నుంచే నమోదైనట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నది
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా కేసుల్లో చైనాను దాటిన మూడు రాష్ట్రాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE