మొత్తం ఎన్ని గృహాలు ఉన్నాయి, ఎంతమందికి ఇవ్వచ్చు గృహాల నాణ్యతను మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా అధికారులు చిలకలూరిపేట నియోజకవర్గ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మంత్రి బొత్స మాట్లాడుతూ జూలై ఎనిమిదో తేదీన వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లను ఇస్తున్నట్లు తెలియజేశారు. 500 రూపాయలు కట్టిన వారికి గృహాలను ఉచితంగా అందజేస్తున్నట్లు వారు అన్నారు. మంత్రి బొత్స వెంట నియోజకవర్గ ఎమ్మెల్యే విడుదల రజిని, వైఎస్ఆర్సిపి నాయకులు,అధికారులు తదితరులు ఉన్నారు.
