728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 15, 2020

లాక్‌డౌన్ పొడిగింపు వార్తలపై స్పందించిన కేంద్రం

న్యూఢిల్లీ:
🔒కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. దేశంలో మరోసారి లాక్‌డౌన్  విధించనున్నారంటూ రెండు, మూడు రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి.

🔒జూన్ 15 నుంచి దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తారంటూ గత సోషల్‌ మీడియాలోవార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

🔒ప్రధాని నరేంద్ర మోదీ 16, 17 తేదీల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలకు మరింతగా రెక్కలు వచ్చాయి.

🔒దీంతో ఈ వార్తలపై కేంద్రం స్పందించింది.

🔒దేశవ్యాప్తంగా మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.

🔒సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని కేంద్ర హోం శాఖ పేర్కొంది.

🔒లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, వదంతుల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించింది.

🔒కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని మోదీ మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించారు.

🔒వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో 82 రోజులుగా లాక్‌డౌన్ కొనసాగుతోంది.

🔒జూన్‌ 8 నుంచి లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వైరస్ తీవ్రత పెరగడంతో ఆందోళన నెలకొంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: లాక్‌డౌన్ పొడిగింపు వార్తలపై స్పందించిన కేంద్రం Rating: 5 Reviewed By: NEWS UPDATE