728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 2, 2020

జూన్​ 6 వరకు గుంటూరు మిర్చి యార్డు క్లోజ్…

గుంటూరు జిల్లా:
★ రెండు రోజులుగా గుంటూరు సిటీలో నమోదైన కేసుల్లో... యార్డు ద‌గ్గ‌ర్లోని మార్కెట్​ వ్యాపారులు ఉండటంతో ముందు జాగ్రత్త చ‌ర్య‌ల్లో భాగంగా యార్డును క్లోజ్ చెయ్యాల‌ని నిర్ణయించారు.

★ ఈ నెల 6వ తేదీ వరకు గుంటూరు మిర్చి యార్డును మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.

★ కోవిడ్-19 కేసులు పెరుగుతూ.. ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ నేపథ్యంలో అధికారులు ఈ డెషిస‌న్ తీసుకున్నారు.

★ క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా ఇప్ప‌టికే రెండు నెలలకు పైగా యార్డును క్లోజ్ చేశారు.

★ అయితే ప్ర‌భుత్వం సడలింపులు ఇవ్వడ‌డంతో.. వారం రోజుల క్రితమే యార్డులో తిరిగి కార్యకలాపాలు స్టార్ట‌య్యాయి.

★ కూలీలు, కమిషన్ ఏజెంట్లు …రోజు తర్వాత రోజు వచ్చే ప‌ద్ద‌తిలో యార్డులో కార్యకలాపాలు జరుగుతున్నాయి.

★ రెండు రోజులుగా గుంటూరు సిటీలో నమోదైన కేసుల్లో… యార్డు ద‌గ్గ‌ర్లోని మార్కెట్​ వ్యాపారులు ఉండటంతో ముందు జాగ్రత్త చ‌ర్య‌ల్లో భాగంగా యార్డును క్లోజ్ చెయ్యాల‌ని నిర్ణయించారు.

★ మంగళవారం వచ్చిన సరకును మాత్రమే క్రయవిక్రయాలు జరుపుకునేందుకు అధికారులు ప‌ర్మిష‌న్ ఇచ్చారు.

★ బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మిర్చి యార్డు మూతపడనుంది.

★ పరిస్థితులు కుద‌ట‌ప‌డ్డ‌ తర్వాత యార్డు తెరవడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జూన్​ 6 వరకు గుంటూరు మిర్చి యార్డు క్లోజ్… Rating: 5 Reviewed By: NEWS UPDATE