728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 29, 2020

విజయసాయిరెడ్డిపై మరోసారి రఘురామ కృష్ణరాజు ఫైర్

అమరావతి:
★ విజయసాయిరెడ్డిపై మరోసారి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు నిప్పులు చెరిగారు.

★ విజయసాయిరెడ్డి లేఖను షోకాజ్ నోటీసుగానే పరిగణించట్లేదని తేల్చిచెప్పారు.

★ అయినా ఆయన క్రమశిక్షణా సంఘానికి అధ్యక్షులా? అని నిలదీశారు.

★ ఆయన్నే కొన్ని ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు.

★ తాను విజయసాయిరెడ్డి లేఖకు రిప్లై ఇవ్వలేదని పేర్కొన్నారు.

★ ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని సాయిరెడ్డి తనను అడిగారన్నారు.

★ మేనిఫెస్టోలో పెట్టారో లేదో తనకు అవసరం లేదని వ్యాఖ్యానించారు.

★ ప్రస్తుతం ముఖ్యమంత్రికి మాత్రమే రిప్లై ఇచ్చినట్లు వెల్లడించారు.

★ సీఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

★ లేఖలో నిజనిజాలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు.

★ లేఖ చేరాక.. మాట్లాడే అవకాశం ఇస్తే... పర్సనల్‌గా సీఎంను కలిసి తన సమస్యలను చెప్పుకుంటానని స్పష్టం చేశారు.

★ తన ఫ్రెండ్ సంగీత దర్శకుడని, ఆయన పంపిన పాటనే సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా పేర్కొన్నారు.

★ ప్రధాని మోదీపై ఉన్న గౌరవంతోనే సాంగ్ విడుదల చేశానన్నారు.

శ్రీవారి ఆస్తుల అమ్మకంపై:
★ ‘నేను వెంకటేశ్వరస్వామి అపర భక్తుడిని.

★  శ్రీవారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలనే వివరించా.

★ శ్రీవారి ఆస్తుల అమ్మకంతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పా.

★ టీటీడీ నిర్ణయాలను నేను ఎక్కడా వ్యతిరేకించలేదు.

★ పార్టీకి వ్యతిరేకంగా నేను ఎక్కడా వ్యవహరించలేదు.

★ పార్టీ క్రమశిక్షణా సంఘమే నోటీసులు ఇవ్వాలి.

★ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడి హోదాలో విజయసాయిరెడ్డి నోటీసులు ఇచ్చారా?

★ విజయసాయి లేవనెత్తిన అంశాలను లేఖలో సీఎం దృష్టికి తీసుకెళ్లా.

★ నా లేఖ పట్ల జగన్‌ సంతృప్తి పొందుతారని ఆశిస్తున్నా.

★ మద్యం తాగి ప్రధానిని, సీఎంను కలిశానని అసహ్యంగా రాశారు.

★ నా గురించి చెత్తగా రాస్తే ప్రివిలేజ్‌కు పంపే అధికారం లేదా?

★ ఇసుకలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రజల సమస్యనే లేవనెత్తా.

★ అక్రమాలపై మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడాకే నేను స్పందించా.

★ సీఎంకు నేను పంపింది వర్తమానం మాత్రమే.

★ పార్టీకి, సీఎంకు వ్యతిరేకంగా నేను ఎక్కడా మాట్లాడలేదని రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విజయసాయిరెడ్డిపై మరోసారి రఘురామ కృష్ణరాజు ఫైర్ Rating: 5 Reviewed By: NEWS UPDATE