దిల్లీ: సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా యాప్‌లపై భారత్ కొరడా ఝళిపించింది. టిక్‌టాక్, యూసీ బ్రౌజర్ సహా మరో 59 చైనా యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ జాబితాలో టిక్ టాక్, యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్, షేరిట్, డ్యూ బ్యాటరీ సేవర్, హలో, లైక్, యూకామ్ మేకప్, వైరస్ క్లీనర్, విగో వీడియో, వీ చాట్, కామ్ స్కానర్, మొబైల్ లెజెండ్స్, న్యూ వీడియో స్టేటస్, ఫొటో వండర్, వీ మీట్, QQ ప్లేయర్ లాంటి 59 యాప్స్ ఉన్నాయి. ఇటీవల భారత్-చైనా దేశాల సరిహద్దులో గల్వాన్ వద్ద భీకర ఘర్షణలో మన దేశానికి చెందిన 20మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. చైనాకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని భావిస్తోన్న భారత్.. ఈ నిర్ణయం తీసుకుంది.
June 29, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: భారత్ లో టిక్ టాక్ బ్యాన్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

