గుంటూరు జిల్లా: బడ్జెట్ సమావేశాలు సందర్భంగా గవర్నర్ ప్రసంగం జగన్ మార్క్ రివర్స్ పాలనకు అద్దం పడుతోంది అని, అంకెల గారడీకి గవర్నర్ వత్తాసు పలకడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురిచేసిందని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు ఏమి లేకనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యులు సభను బహిష్కరించి మంచిపని చేశారన్నారు. గవర్నర్ వ్యవస్థ రబ్బరు స్టాంప్ వ్యవస్థలా ఉండకూడదు అని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. 3 రాజధానులు అంశానికి గవర్నర్ మద్దత్తు పలకడం సరికాదన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలకు బడ్జెట్లో మొండిచేయి చూపించడం, CRDA రద్దు నిర్ణయం ప్రజా వ్యతిరేక విధానాలకు అద్దం పడుతోంది అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం సరిచేయడానికి కృషి చేయాల్సిన గవర్నర్ ఆయన తీసుకున్న రివర్స్ నిర్ణయాల్లో సహకారాన్ని అందిస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది అన్నారు.