728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 17, 2020

తెదేపా నేతల అరెస్ట్ తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు తెదేపా ఫిర్యాదు

అమరావతి:
♦️అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ ల అరెస్టు తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు తెలుగుదేశం నేతల ఫిర్యాదు.

♦️అచ్చెన్నాయుడు అరెస్టు తీరు పై ఫిర్యాదు చేసిన టీడీఎల్పీ ఉపనేత రామానాయుడు.

♦️జేసీ కుటుంబ సభ్యులు అరెస్టు లై ఫిర్యాదు చేసి ఎమ్మెల్సీ గౌరివాణి శ్రీనివాసులు.

♦️వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షన్ వాదాన్ని సాగిస్తోందని మండిపాటు.

♦️ప్రభుత్వ ప్రతీకార చర్యలతో  మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.

♦️రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం నేతలు, క్యాడర్ పై హింస కొనసాగిస్తోంది.

♦️తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తున్నారు.

♦️ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడు ని అక్రమంగా అరెస్టు చేశారు.

♦️అరెస్టులో వైకాపా ఆదేశాలకు అనుగుణంగా ఎసిబి అధికారులు వ్యవహరించారు. 

♦️కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదు. 

♦️శస్త్రచికిత్స గాయం తో బాధపడుతున్న అచ్చెన్నాయుడు ను శ్రీకాకుళం నుండి దాదాపు 600 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణింప చేశారు. 

♦️అరెస్టు అమానుషమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. 

♦️వైకాపా వ్యూహాలను అనుసరిస్తూ ప్రతిపక్షాలపై కక్ష సాధింపు గా అరెస్టు తీరు  సాధించింది. 

♦️తమ ఒత్తిళ్ళకు లొంగని పార్టీ నేతలను ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వారిని అరెస్టు చేసింది.

♦️ఇందులో భాగంగా నే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అష్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారు.

♦️ప్రతీకారం తీర్చుకోవాలనే తపనతోనే ఈ అరెస్టు లు జరిగాయి.

♦️రాష్ట్రంలో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన లో జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నేతల విజ్ఞప్తి. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: తెదేపా నేతల అరెస్ట్ తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు తెదేపా ఫిర్యాదు Rating: 5 Reviewed By: NEWS UPDATE