వైరల్ అయిన వార్త...
ప్రస్తుతం భారతదేశానికి ఎడారి మిడుతలు ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలోని నగరాల్లోకి మిడుతలు ప్రవేశించాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇవి కనిపించాయి. కొన్ని లక్షల ఎడారి మిడుతలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలోని 100 జిల్లాల్లో పంటల మీద పడ్డాయి. రాబోయే కొద్ది గంటల్లో మరికొన్ని జిల్లాల్లో ప్రవేశించే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఈ మిడుతల దండుపై హై అలర్ట్ ప్రకటించాయి.ఈ మిడుతలు గుంపులు గుంపులుగా ప్రయాణం చేస్తూ.. దారిలో అడ్డు వచ్చిన ఎన్నో పంటలను తినేస్తూ ఉన్నాయి. ఇవి అన్ని రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తే దేశంలో తినడానికి తిండి కూడా దొరకదు. ఇవి గాలి ఎటువైపు వీస్తే అటు వైపు.. అది కూడా పగటి పూట ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇప్పటికే కొన్ని లక్షల హెక్టార్లలో పంటలను తినేశాయి.ఓ వైపు అధికారులు, ప్రజలు తెగ టెన్షన్ పడుతూ ఉంటుంటే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోకి మిడతలు వచ్చేశాయని.. చిలకలూరిపేటలో కూడా ఇవి కనిపించాయంటూ ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది.
నిజమేమిటి...?
మిడుతలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయంటూ వచ్చిన వార్తలు పచ్చి అబద్ధం.కోలిఫెరా ఆకుల మీద కొన్ని పురుగులు పడి తినడాన్ని చూడొచ్చు. డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ-అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేషన్ సెక్రెటరీ మాట్లాడుతూ భోంగిర్ లో మిడుతల సంచారం అన్నది పచ్చి అబద్ధమని తేల్చిచెప్పారు. సో మిడుతల సంచారం ఒట్టి పుకారే... .ఇవి స్థానికంగా ఉండే పురుగులు తప్పితే మిడుతలు కావు.

