అమరావతి :సోషల్ మీడియా లో ఫేక్ అకౌంట్లతో ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పై,చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై సి.ఐ.డి అడిషనల్ డి.జి.పి సునీల్ కుమార్ కు ఎమ్మెల్యే విడదల రజిని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సి.ఐ.డి అడిషనల్ డి.జి.పి సునీల్ కుమార్ మాట్లాడుతూ అలాంటి అకౌంట్లను గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియచేశారు.