728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 27, 2020

ఆ పోస్టులో ఎనిమిదేళ్ల నుండి ఇన్చార్జ్ అధికారే... ఆ కుళాయిల్లో వచ్చేది అవినీతి ధారలే..

చిలకలూరిపేట:
వర్షా కాలం వచ్చేసింది...చిలకలూరిపేట  పట్టణంలో మున్సిపల్ కుళాయిల ద్వారా కలుషిత నీరు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  గత సంవత్సరం కలుషిత నీరు తాగి చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అనేకమంది డెంగ్యూ వ్యాధి బారిన పడిన విషయం ఇప్పటికీ మర్చిపోలేదు.
ఇదంతా ఎందుకు చెప్తున్నాము అనుకుంటున్నారా ...దీనికి కారణం ఏమిటంటే చిలకలూరిపేట పట్టణం లోని పురపాలక సంఘం పరిధిలో విచ్చలవిడిగా లీకేజీలు ఉండటం ...ఆ ట్యాప్ ఇన్స్పెక్టర్  లీకేజీలు సరి చేయాలంటే చేతులు తడపాల్సిందేనని పుర ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.

చిలకలూరిపేట పట్టణ పురపాలక సంఘం పరిధిలో సుమారు 27 వేల కుటుంబాలు ఉన్నాయి. కుళాయిలు సుమారు 14 వేల వరకు ఉండొచ్చు.  పట్టణ పురపాలక సంఘం పరిధిలో గణపవరం, పసుమర్రు, మానుకొండ వారి పాలెం గ్రామాలు కూడా ఇటీవల కలిశాయి. వాటి రికార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పట్టణ పురపాలక సంఘ అధికారుల ఉద్యోగస్తుల బాధ్యతలు మరింత పెరిగాయి.

అయితే ఇంత పెద్ద పురపాలక సంఘం లో  ట్యాప్ ఇన్స్పెక్టర్ పోస్టు గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇంచార్జి టాప్ ఇన్స్పెక్టర్ గానే కొనసాగుతుండటం విశేషం. పట్టణ పురపాలక సంఘం పరిధిలో ఇద్దరు మాత్రమే టర్న్ కాక్ వర్కర్లు ఉన్నారు. వారిలో లో 2012 లో ఒక వ్యక్తిని ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ గా నియమించారు.  ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎంతోమంది కమిషనర్లు మారారు ...కానీ పూర్తిస్థాయి టాప్ ఇన్స్పెక్టర్ను ఇక్కడ నియమించలేదు.  సరే ఆ ట్యాప్ ఇన్స్పెక్టర్ ఏమన్నా ఐటిఐ చేసిన వ్యక్తినా అంటే అదీను కాదు... కేవలం లీకులు సరి చేసే వ్యక్తి మాత్రమే...ట్యాప్ ఇన్స్పెక్టర్ కింద మొత్తం మీద అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎనిమిది మంది వరకు పని చేస్తున్నారు. ఎన్. ఎం.ఆర్ ద్వారా ఉద్యోగం చేస్తూ  2009 లో టర్న్  కాక్ అయిన సదరు వ్యక్తిని మూడేళ్లకే ఇన్చార్జి ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు ఇచ్చారు అధికారులు.

సదరు వ్యక్తిని నేటికీ అందరూ ఇన్చార్జి కాదు... ట్యాప్ ఇన్స్పెక్టర్ అనుకుంటున్నారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ఆ పోస్టు చేసే వ్యక్తి పై అనేక  అవినీతి ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రాత్రికి రాత్రి చేయి తడిపితే అనధికార కుళాయిని ఏర్పాటు చేస్తారు. పట్టణంలో మున్సిపాలిటీ ద్వారా లీకేజీలు చేయమని ప్రజలు కోరితే రోజులు గడుస్తాయి. కానీ చేయి తడిపితే అన్ని పనులు త్వరగా చేస్తారని నానుడి కూడా ఉంది.

ఈ విషయాలపై మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరగా కేవలం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ మాత్రమేనని, సదరు పోస్టు ఇంకా భర్తీ చేయలేదని పై ఆరోపణలపై విచారణ జరిపిస్తామని తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆ పోస్టులో ఎనిమిదేళ్ల నుండి ఇన్చార్జ్ అధికారే... ఆ కుళాయిల్లో వచ్చేది అవినీతి ధారలే.. Rating: 5 Reviewed By: NEWS UPDATE