728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 27, 2020

పోలవరం కాంట్రాక్టు నిబంధనల్లో ఉల్లంఘనల్లేవ్‌.. కేంద్ర జలశక్తి శాఖ స్పష్టీకరణ

న్యూఢిల్లీ:
★ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది.

★ ప్రాజెక్టు కాంట్రాక్టు నిబంధనల్లో ఉల్లంఘనలు జరగలేదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది.

★ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాని కార్యాలయానికి జలశక్తి శాఖ నివేదిక పంపింది.

★ నిర్ణయాలన్నీ అధీకృత సంస్థల అనుమతితోనే జరిగాయని స్పష్టం చేసింది.

★ 2017-18లో నాటి గుత్తేదారు జాప్యం వల్ల మరొకరికి నామినేషన్‌ పద్ధతిపై గత ప్రభుత్వం ఇచ్చిందని  పేర్కొంది.

★ 60-సి నిబంధన మేరకే కాంట్రాక్టు సంస్థను మార్చినట్లు జలశక్తి శాఖ తెలిపింది.

★ గుత్తేదార్లకు నిర్మాణపనులు అప్పగించే బాధ్యత రాష్ట్ర పరిధిలోనే ఉందని పేర్కొంది.

★ ధరల పెరుగుదలకు అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని వివరించింది.

★ లావాదేవీ ఛార్జీల చెల్లింపుల ఆరోపణపై అవినీతి నిరోధక శాఖ విచారణ చేస్తోందని పేర్కొంది.

★ విజిలెన్స్‌ అధికారులూ విచారణ చేపట్టారని పీఎంవోకు జలశక్తి శాఖ చెప్పింది.

★ పునరావాస ప్యాకేజీలో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై పీఎంవో వివరణ కోరింది.

★ పీఎంవో అడిగిన వివరణపై కేంద్ర జలశక్తి శాఖ సవివర నివేదిక పంపింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: పోలవరం కాంట్రాక్టు నిబంధనల్లో ఉల్లంఘనల్లేవ్‌.. కేంద్ర జలశక్తి శాఖ స్పష్టీకరణ Rating: 5 Reviewed By: NEWS UPDATE