728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 17, 2020

తగిన రీతిలో బదులిచ్చే సత్తా మనకుంది: ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ:
★ భారత్ శాంతిని కోరుకుంటుందని, కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగిన రీతిలో బదులిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

★ లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్‌ సైనికులకు ప్రధాని మోదీ రెండు నిమిషాల సేపు మౌనం పాటించి నివాళులర్పించారు.

★ దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వృథా కావని, దేశం వాటిని తప్పక గుర్తుపెట్టుకుంటుందన్నారు.

★ ఈ మేరకు కరోనాపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

★ హోం మంత్రి అమిత్‌ షా, 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

★ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు వృథా కావని జాతికి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.

★ దేశ ఐక్యత, సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీలేదు.

★ భారత్ శాంతిని కోరుకుంటుందన్నారు.

★ కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన రీతిలో స్పందించే సత్తా భారత్‌కు ఉందని ప్రధాని మోదీ అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: తగిన రీతిలో బదులిచ్చే సత్తా మనకుంది: ప్రధాని నరేంద్ర మోదీ Rating: 5 Reviewed By: NEWS UPDATE