728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 12, 2020

దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన, విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదు: చంద్రబాబు

అమరావతి:
టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్..

★ దేశమంతా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలుచేస్తోంటే, ఏపీలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత 'రాజారెడ్డి రాజ్యాంగం' అమలుచేస్తున్నారు.

★ రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తుంది.

★ దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన, విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదు.

★ వైసీపీ దుర్మార్గాల వల్ల రాష్ట్రానికి జరిగిన కీడు, ప్రజలకు కలిగిన చేటు గురించి మీ దృష్టికి తెచ్చేందుకే ఈ లేఖ రాస్తున్నాను.

★ వైసీపీ పాలకుల నైజాన్ని ప్రజలే చక్కదిద్దాలి.

★ న్యాయాన్ని, చట్టాన్నీ కాపాడటంలో, రాజ్యాంగాన్ని రక్షించడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది.

★ ప్రజల ప్రాధమికహక్కుల పరిరక్షణకోసం గత ఏడాదిగా తెలుగుదేశం చేస్తోన్న రాజీలేని పోరాటంలో రాజకీయాలకు అతీతంగా కలిసివచ్చిన వారందరినీ అభినందిస్తున్నాను.

★ ఇకపై కూడా రాష్ట్ర ప్రయోజనాలను, భావితరాల భవిష్యత్తును కాపాడే కృషిలో మీరంతా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: దేశ చరిత్రలోనే ఇంతటి రాక్షసపాలన, విధ్వంసకాండ ఏ ప్రభుత్వమూ చేయలేదు: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE