728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 24, 2020

జనం వెంటే ఎమ్మెల్యే...అభివృధ్యే లక్ష్యం...

చిలకలూరిపేట:
నాయకుడంటే ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని నిలవాలి. కష్టాల్లో కన్నీళ్లు తుడిచి నేనున్నానని భరోసా ఇవ్వాలి. అటువంటి నాయకత్వ లక్షణాలు ప్రజలు ఎమ్మెల్యే విడద‌ల‌ రజనిలో చూడ‌బ‌ట్టే  చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆమెను త‌మ ప్ర‌తినిధిగా గెలిపించుకున్నారు.

చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏడాది కాలంలో  విడదల రజని ఎంపికైనప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజల నుంచి  అభిమానాన్ని చూరగొంటున్నారు. కష్టాలతో,కన్నీళ్లలతో సహవాసం చేస్తూ తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో, తమ సమస్యలు ఎవరివల్ల పరిష్కారానికి నోచుకుంటాయో అని వేచి చూస్తున్న ప్రజలకు విడదల రజని పెద్ద దిక్కాయ్యారు. ఏసీ రూముల, కార్లు, విలాసవంతమైన జీవితాన్ని వదలి ప్రజలకు సేవ చేయాలన్న సత్ సంకల్పంతో  ముందుకు వచ్చిన ఆమెను   రజనమ్మ అంటూ ఆనురాగంతో ఆద‌రిస్తున్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంట‌నే తన బాద్య‌త తీరిపోయింద‌నుకోలేదు.
ప్ర‌జ‌ల‌నుంచి త‌ప్పించుకొని పారిపోలేదు.అనునిత్యం ప్ర‌జ‌ల్లోనే ఉంటూ వ‌చ్చారు. నియోజ‌క‌వ‌ర్గంలో మొద‌టి సారిగా అవినీతి, అధికారుల అల‌స‌త్వంపై నేరుగా ఆయా కార్యాల‌యాల‌కే వెళ్లి ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మం ప్రారంభించి, అనేకమంది అవినీతి అధికారుల‌ను బ‌దిలీ చేయించారు.ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చ‌టానికి ఏడాది  లోపే జ‌గ‌న‌న్న వార్డు బాట కార్య‌క్ర‌మం ప్రారంభించి నేరుగా ప్ర‌జ‌లు అనుభ‌విస్తున్న క‌ష్టాల‌ను, వారి సాధ‌క బాధ‌ల‌ను తీర్చ‌టానికి ప్ర‌య‌త్నించారు. 

ప‌ల్నాడు గ్రిడ్‌లో నియోజ‌క‌వ‌ర్గాన్ని చేర్చ‌టంతో త్వ‌ర‌లోనే అనేక ప్రాంతాల్లో తాగునీటి స‌మ‌స్య తీర‌నుంది. మూడు నెల‌ల క‌రోనా కాలంలో లాక్‌డౌన్ విధించ‌టంతో ఇంటికే ప‌రిమిత‌మై ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల‌కు త‌న సంస్థ విడ‌ద‌ల ఫౌండేష‌న్ ద్వారా నిత్యావ‌స‌రాలు, కూర‌గాయ‌లు పంపిణీ చేసి వేలాది మందిని ఆద‌రించారు. ఇలా ఆమె ప్ర‌జ‌ల‌ను గెలిచారు.

నేడు ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌ని జ‌న్మ‌దినం.. త‌మ అభిమాన నాయ‌కురాలి జ‌న్మ‌దినాన్ని అత్యంత ఘ‌నంగా నిర్వ‌హించ‌టానికి అభిమానులు, పార్టీ నాయ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు...
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జనం వెంటే ఎమ్మెల్యే...అభివృధ్యే లక్ష్యం... Rating: 5 Reviewed By: NEWS UPDATE