728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 23, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

గుంటూరు జిల్లా:
♦️నాదెండ్ల మండలంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు తాజాగా ఈ రోజు నమోదయ్యాయి. నాదెండ్లలోని బిసి కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నమోదయింది.

♦️అలానే నాదెండ్ల మండలం కనపర్రు  గ్రామంలో నివసిస్తున్న ఒక యువకుడు (24) నరసరావుపేటలోని ఒక ప్రైవేటు ఎలక్ట్రానిక్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి ట్రూనాట్ పరికరం ద్వారా పరీక్షించగా కరోనా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.

♦️ప్రభుత్వ వైద్యులు వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో అధికారులు కంటైన్మెంట్ జోన్ ను ఏర్పాటు చేయనున్నారు.

♦️అయితే ఈ రెండు కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు నాదెండ్ల మండలంలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు తాజాగా రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE