728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 23, 2020

ఎల్జీ పాలిమర్స్‌: హైకోర్టు కెక్కిన దక్షిణ కొరియా బృందం

అమరావతి: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై దక్షిణ కొరియాకు చెందిన ఎనిమిది మంది ప్రతినిధులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో తమను ఇక్కడే ఆపేశారని దక్షిణ కొరియా వెళ్లేందుకు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎల్జీ సంస్థకు వీళ్లకు ఎలాంటి సంబంధం లేదని సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కావడం వల్ల విశాఖ వచ్చారని వాళ్ల తరపు న్యాయవాది వాదించారు. ఇక వివరాలు సేకరించేందుకే దక్షిణ కొరియా బృందానికి పోలీసులు నోటీసులిచ్చినట్లు ఏజీ శ్రీరాం హైకోర్టుకు తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై భవిష్యత్తులో విచారణ కోసం అవసరమైతే మళ్లీ రావాల్సి ఉంటుందని ఏజీ తెలిపారు. వాదనలు విన్న  ధర్మాసనం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసుల అభ్యర్థన మేరకు వారు రాకపోతే హైకోర్టులో పిటిషన్‌ వేయవచ్చని సూచించి తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎల్జీ పాలిమర్స్‌: హైకోర్టు కెక్కిన దక్షిణ కొరియా బృందం Rating: 5 Reviewed By: NEWS UPDATE