728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 30, 2020

చిలకలూరిపేట పట్టణంలో నేడు తాజాగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు

చిలకలూరిపేట:
♦️పట్టణంలోని చినపీర్ సాహెబ్ వీధిలో సోమవారం రాత్రి మరో పాజిటివ్ కేసు నమోదయ్యింది. చిలకలూరిపేట పట్టణంలోని చినపీరుసాహెబ్ వీధిలో నివసిస్తున్న యువకునికి (30) కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు  తెలిసింది.

♦️ఈ యువకుడు గత కొద్ది రోజుల క్రితం పట్టణంలోని ఇంటిలిజెంట్ మానిటరింగ్ ఎనాలసిస్ సర్వీసెస్ క్వారంటైన్ బస్సులో నిర్వహించిన పరీక్షల్లో టెస్టు చేయించుకున్నారు. అయితే గత నాలుగు రోజుల క్రితం 330 మందికి నెగిటివ్ రిజల్ట్స్ రాగా ఆ యువకుని రిజల్ట్ లో కొంత అనుమానం రావడంతో మరలా ఆ యువకుని స్వాబ్ ను పరిశీలించమని వైద్యాధికారులు జిల్లా అధికారులకు పంపారు.

♦️ఆ పరీక్షల్లో సోమవారం రాత్రి ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. యువకునికి కరోనా పాజిటివ్ రావడంతో వీధిలో కరోనా సోకిన వారి సంఖ్య ఏడుకు చేరుకుంది.

♦️మార్చి నెల 25వ తేదీ నుండి ఈనెల 30వ తేదీ వరకు ఆ వీధిలో మొత్తంమీద ఏడుగురికి కరోనా సోకడంతో ఆ వీధిలో కంటైన్మెంట్ జోన్ ను ఇంకా నెల వరకు అలానే ఉంచే అవకాశాలు ఉండటంతో ఆ వీధిలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు తాజాగా ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE