728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 18, 2020

ఈ పరిస్థితుల్లో రథయాత్రకు అంగీకరిస్తే.. ఆ జగన్నాథుడు మమ్మల్ని క్షమించడు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ:
★ ప్రతియేటా అత్యంత వైభవోపేతంగా జరిగే పూరీ జగన్నాథుడి రథయాత్ర విషయంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

★ ప్రస్తుతం కరోనా విపత్తు నేపథ్యంలో రథయాత్రను నిర్వహించకపోవడమే మేలని వ్యాఖ్యానించింది.

★ ’ప్రస్తుత పరిస్థితుల్లో రథయాత్ర నిర్వహణకు మేం అంగీకరిస్తే.. ఆ జగన్నాథుడు మమ్మల్ని క్షమించడు..‘ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే స్పష్టం చేశారు.

★ కరోనా మహమ్మారి కారణంగా జగన్నాథుడి రథయాత్రను, దానికి సంబంధించిన కార్యకలాపాలను ఈ సంవత్సరం అనుమతించబోమని కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

★ జూన్ 23న ప్రారంభం కానున్న రథయాత్రను వాయిదా వేయాలంటూ ఓ పిటీషనర్ సుప్రీంకోర్టు మెట్లెక్కారు.

★ ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీం.. రథయాత్రకు సంబంధించిన అన్ని కార్యకలాపాలపై స్టే విధించారు.

★ కాగా.. ఈ యేడాది పూరీ జగన్నాథుని రథయాత్రను అశేష భక్తజనం లేకుండానే నిర్వహిస్తామని మే నెలాఖరున శ్రీ జగన్నాథ్ ఆలయ కమిటీ ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే..

★ ఆలయ కమిటీ నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఒడిశా సర్కార్... రథ యాత్ర సందర్భంలో ప్రత్యేకంగా రైళ్లు వేయాల్సిన అవసరం ఏమీ లేదని కేంద్ర రైల్వే శాఖకు తేల్చి చెప్పింది.

★ లక్షలాది భక్తుల వీక్షణార్థం అన్ని మీడియా ఛానళ్లలోనూ రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, అప్పుడు భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని కమిటీ ప్రభుత్వానికి సూచించింది.

★ ‘‘ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వివిధ పండుగలు, ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే రథను నిర్వహించాలని డిసైడ్ అయ్యాం. రథయాత్రపై తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే.’’ అని ఆలయ కమిటీ అధ్యక్షుడు గజపతి మహారాజా అన్నారు.

★ కాగా.. సుప్రీం  తీర్పును బట్టి శ్రీ జగన్నాథ్ ఆలయ కమిటీ ఏం చేయబోతోందో వేచిచూడాలి. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఈ పరిస్థితుల్లో రథయాత్రకు అంగీకరిస్తే.. ఆ జగన్నాథుడు మమ్మల్ని క్షమించడు: సుప్రీంకోర్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE