728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 18, 2020

ఏపీ ఎస్‌ఈసీ కేసులో మరోసారి స్టేకు నిరాకరణ

న్యూఢిల్లీ:
★ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

★ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పునర్‌ నియామకాన్ని సవాల్‌ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం...

★ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

★ ఇదే అంశంపై ఇప్పటికే విచారణ జరిపి నోటీసులు ఇచ్చామన్న సీజేఐ, ఈ పిటీషన్‌పై కూడా నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

★ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.

★ ఈమేరకు కొత్తగా దాఖలైన పిటిషన్లను గత పిటిసన్లతో ట్యాగ్‌ చేసింది.

★ దీనిపై వచ్చే వారం విచారణ జరిగే అవకాశముంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ ఎస్‌ఈసీ కేసులో మరోసారి స్టేకు నిరాకరణ Rating: 5 Reviewed By: NEWS UPDATE