728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 4, 2020

అప్పటి వరకూ సినిమా హాళ్లకు నో!

న్యూఢిల్లీ:
★ దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే అంశాన్ని జూన్‌ తర్వాత మాత్రమే పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ విషయంపై సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మాట్లాడుతూ...

★ జూన్‌ నెలకు సంబంధించి కొవిడ్-19 కేసుల సంఖ్యను, పరిస్థితిని పరిశీలించిన అనంతరం మాత్రమే సినిమా హాళ్లను ఎప్పుడు తెరిచేదీ నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.

★ కొవిడ్‌-19 పరిణామాల వల్ల చలన చిత్ర రంగం ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తదితర సంఘాలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే.

★ ఈ విషయమై కేంద్ర మంత్రి జావడేకర్‌ మంగళవారం ఆయా సంఘాల ప్రతినిధులతో వీడియో సమావేశం ద్వారా చర్చించారు.

★ ఈ సందర్భంగా సినిమా హాళ్లను తెరవాలన్న విజ్ఞప్తిపై మంత్రి పై విధంగా స్పందించారు.

★ దేశంలో ఉన్న 9,500 సినిమా హాళ్లలో కేవలం టికెట్ల అమ్మకం ద్వారా రోజుకు రూ.30 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని... ఆ మేరకు భారీగా సష్టపోయినప్పటికీ లాక్‌డౌన్‌ నిర్ణయంపై సినీరంగం సంఘీభావంగా ఉండటాన్ని ఆయన ప్రశంసించారు.

★ వేతనాల్లో సబ్సిడీలు, రుణాలపై మూడు సంవత్సరాల పాటు వడ్డీ మాఫీ, పన్నులు, సుంకాల మినహాయింపు, విద్యుత్‌ బిల్లుల కనీస డిమాండు ఛార్జీల మాఫీ తదితర డిమాండ్లను ఆయా సినీ సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

★ అయితే వీటిని నెరవేర్చేందుకు ప్రభుత్వంపై అధిక భారం పడుతుందని అన్న మంత్రి, వారి డిమాండ్లను సంబంధిత శాఖల దృష్టికి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

ఇక చిత్ర నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించటం గురించి జావడేకర్‌ మాట్లాడుతూ...

★ అందుకు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఇప్పటికే జారీచేసిందన్నారు.

★ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కొవిడ్‌ లాక్‌డౌన్‌ నిబంధనలను దశలవారీగా సడలిస్తూ వస్తోంది.

★ ఈ క్రమంలో కరోనా అన్‌లాక్‌-1 కు సంబంధించి మార్గదర్శకాలను హోంశాఖ ఇటీవల ప్రకటించింది.

★ దీనిలో భాగంగా... ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైనవి తెరిచేందుకు అనుమతి నిచ్చింది.

★ కాగా, షాపింగ్‌ మాల్స్‌ జూన్‌ 8 నుంచి ప్రారంభం కానున్నాయి.

★ ఇక సినిమా హాళ్లు, థియేటర్లు, ఈతకొలనులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, బార్లు, సమావేశ మందిరాలు వంటివి తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు మూసే ఉంచాలని ప్రభుత్వం ప్రకటించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: అప్పటి వరకూ సినిమా హాళ్లకు నో! Rating: 5 Reviewed By: NEWS UPDATE