728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 25, 2020

చిలకలూరిపేట పట్టణంలో ఒక కంటైన్మెంట్ జోన్ తొలగింపు... మరొకటి కుదింపు

చిలకలూరిపేట:
🔷చిలకలూరిపేట పట్టణంలో ప్రస్తుతం మూడు కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. మూడు కంటైన్మెంట్ జోన్లలో గత నెల 25వ తేదీన చిన్నపీరుసాహెబు వీధిలో కంటైన్మెంట్ జోన్ను అధికారులు ఏర్పాటు చేసారు.

🔷గత నెల 27వ తేదీన పట్టణంలోని రజక వీధి పరిధిలోని ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో 200 మీటర్ల పరిధిలో అధికారులు కంటైన్మెంట్ జోన్ను ఏర్పాటు చేశారు.

🔷అయితే రజక వీధిలోని మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటినుండి ఈ నెల 24వ తేదీ నాటికి 28 రోజులు పూర్తయింది. చిన్నపీరుసాహెబ్ వీధిలో గత నెల 25వ తేదీ నుండి ఇప్పటివరకు సుమారు ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది.

🔷అలానే కొద్ది రోజుల క్రితం సుభాని నగర్లో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో ఆ ప్రాంతంలో కూడా కంటైన్మెంట్ జోన్ను ఏర్పాటు చేశారు.

🔷పట్టణంలోని రజక వీధిలోని కంటైన్మెంట్ జోన్ ను తొలగించమని చుట్టుపక్కల వ్యాపారస్తులు గత కొద్ది రోజుల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కంటైన్మెంట్ జోను తొలగింపు, కుదింపు విషయంలో జిల్లా అధికారులను స్థానిక అధికారులు బుధవారం సంప్రదించారు.

🔷అయితే రజక వీధిలోని కంటైన్మెంట్ జోన్ తొలగించి, చినపీరుసాహెబ్ వీధిలోని జోన్ ను కుదించాలని జిల్లా అధికారులు బుధవారం రాత్రి చిలకలూరిపేట అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

🔷25వ తేదీ గురువారం ఉదయం ఈ రెండు జోన్లలో రజక వీధిలోని జోన్ ను ఎత్తివేసి, చిన్నపీరుసాహెబ్ వీధిలోని జోన్ ను అధికారులు కుదించే అవకాశాలు ఉన్నాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో ఒక కంటైన్మెంట్ జోన్ తొలగింపు... మరొకటి కుదింపు Rating: 5 Reviewed By: NEWS UPDATE