చిలకలూరిపేట:
♦️ఇప్పటి వరకు చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనాతో ఇరువురు మృతిచెందారు.
♦️చిలకలూరిపేట నియోజకవర్గంలో కరోనా నియంత్రణలో ఉన్నా...ఈ వ్యాధి సంక్రమణతో ఇరువురు మృత్యువాత పడ్డారు. తాజాగా చిలకలూరిపేట మండలంలోని దండమూడి గ్రామంలో కరోనా సోకి చికిత్స పొందుతున్న మహిళ (70)కు గుండెపోటు రావటంతో శనివారం సాయంత్రం మృతి చెందినట్లు వైద్యాదికారులు నిర్దారించారు.
♦️నాదెండ్ల మండలం చందవరానికి చెందిన వృద్దుడు మృతి చెందిన విషయం విదితమే. ఇతను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందిన సమయంలో బెడ్‌సీట్లు ఉతికిన దోబికి కరోనా సోకింది. ఈ మహిళను చికిత్సకుపంపి , పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని రజకవీధి, పరిసర ప్రాంతాలను కంటోన్మెంట్‌జోన్లుగా ప్రకటించారు.
♦️చికిత్స సమయంలోనూ, మృతి చెందిన అనంతరం ఇతనితో సన్నిహితంగా ఉన్న తిమ్మాపురం గ్రామానికి చెందిన వారికి, చందవరంకు చెందిన వారికి కరోనా సోకటంతో చికిత్స పొందుతున్నారు.
♦️మృతిచెందిన దండమూడికి చెందిన మహిళ నరసరావుపేట వెళ్లిరావటం వల్ల కరోనా సోకింది. నియోజకవర్గంలో మృతి చెందిన ఇరువురు కూడా వృద్దులు కావటం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఉండటంతో మృత్యువాత పడ్డారు. కరోనా నియంత్రణలో ఉన్నా నియోజకవర్గానికి చెందిన ఇరువురు మృత్యువాత పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
♦️వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఆరోగ్య సమస్యలపట్ల జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.