728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 15, 2020

లక్ష కట్టిన వారికి కూడా ఉచితంగా ఇవ్వాలి: నవతరం పార్టీ

చిలకలూరిపేట: లక్ష రూపాయలు, యాభై వేల రూపాయలు కట్టినోళ్లు ఏం పాపం చేశారు బొత్స సత్యనారాయణ  సమాధానం చెప్పాలని నవతరం పార్టీ  అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.

పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు టిడ్కో గృహాలు 300 చదరపు అడుగుల ఇంటికి 500 చొప్పున చెల్లించిన వారికి పూర్తిగా ఉచితంగా ఇల్లు ఇస్తామని చిలకలూరిపేటలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడాన్ని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం స్వాగతిస్తూ 360 చదరపు అడుగుల ఇంటికి 50 వేల రూపాయలు,430 చదరపు అడుగులు ఇంటికి 1 లక్ష రూపాయలు చెల్లించిన వారికీ ఉచితంగా ఇళ్ళు ఇవ్వాలని రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.

అప్పులు చేసి వడ్డీలు చెల్లిస్తున్న నిరుపేదల బాధ ను అర్థం చేసుకొని నవరత్నాలు పథకాల లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉచితంగా ఇళ్ళు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.కేంద్రం నుంచి సగం డబ్బులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన సగం డబ్బులు బ్యాంకులకు చెల్లించి పేదవాడి ఇంటి కలను నిజం చేసి తమ చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలి అని డిమాండ్ చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: లక్ష కట్టిన వారికి కూడా ఉచితంగా ఇవ్వాలి: నవతరం పార్టీ Rating: 5 Reviewed By: NEWS UPDATE