728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 24, 2020

హైకోర్టుకు‌ హాజరైన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

అమరావతి:
🔷మద్యం అక్రమరవాణా కేసులో సీజ్ చేసిన వెహికల్స్ ను విడుదల చేసే అంశంపై హైకోర్టులో జరిగిన విచారణ.

🔷వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపున న్యాయవాది డిఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదనలు.

🔷డీజీపీ కోర్టుకు హజరు కావాల్సినంత కేసు ఇది కాదు.. కానీ కోర్టుకు ఎవరైనా సమానమే అని వ్యాఖ్యానించిన 17వ కోర్టు జడ్జి దేవానంద్.

🔷డీజీపీ గౌతమ్ సవాంగ్ నిజాయితీ, నిబద్ధత కలిగిన కలిగిన ఆఫీసర్ అని నాకు తెలుసు అంటూ డీజీపీ గౌతం సవాంగ్ కు కితాబు ఇచ్చిన జడ్జి దేవానంద్.

🔷కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ శాఖను అభినందించిన న్యాయమూర్తి దేవానంద్.

🔷డీజీపీకి అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ తరుపు న్యాయవాదుల సరిగా గైడ్ చేయడం లేదని డీజీపీ గౌతం సవాంగ్ కు సూచించిన  జడ్జి దేవానంద్.

🔷SEB లో కింది స్థాయిలో ఉన్న చిన్నచిన్న లోపాలను సరిచేసుకోవాలని సూచించిన న్యాయస్థానం.

🔷ప్రభుత్వం వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలపై  ప్రభుత్వం తరుపున న్యాయవాదులు సరైన విధంగా గైడ్ చేయడం లేదన్న జడ్జి దేవానంద్.

🔷ప్రభుత్వ న్యాయవాదుల వ్యవహార శైలి కారణంగా హైకోర్టు, ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అభిప్రాయం ప్రజలలోకి వెళుతోందని ఇది ఎవ్వరికీ మంచిది కాదన్న హైకోర్టు.

🔷కేసుల్లో వున్న వాహనాలు ఆయా శాఖలకు అప్పగించాలని మెమో జారీ చేశామని కోర్టుకు తెలిపిన డీజీపీ
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: హైకోర్టుకు‌ హాజరైన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ Rating: 5 Reviewed By: NEWS UPDATE