728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 29, 2020

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో..? జగనన్న చేయూత పథకానికి గండి..?

చిలకలూరిపేట:
♦️అది APSPDCL విద్యుత్ శాఖ మాయా లేదా ప్రభుత్వ పథకాలు తొలగించడానికి చేసిన ప్రయత్నమా అనే విషయం అర్థం కాక జనం జుట్టు పీక్కుంటున్నారు.

♦️రాష్ట్రవ్యాప్తంగా జగనన్న చేయూత పథకానికి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ తదితర పేద వర్గాలకు చెందిన మహిళలు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు జగనన్న చేయూత పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనేకమంది ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకొని తీరా వార్డు వాలంటరీల వద్దకు వెళ్లి తమ పేరు నమోదు చేయమని అడగగా అక్కడ ఒక విచిత్రమైన సమస్య ఎదురైంది.

♦️అదేమిటంటే మీరు 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వాడుకున్నారు. కావున మీరు ఈ పథకానికి అర్హులు కారు అని వాలంటరీ చెప్పడంతో బిక్కమొహం వేస్తున్నారు ఆ మహిళలు.

♦️అసలు 300 యూనిట్లు మించి కరెంట్ బిల్లు ఎందుకు వచ్చింది? అంటే ఒక మాయా ఎలా ఉందో చూడండి. మార్చి 23వ తేదీన కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేసిన విషయం భారతదేశం మొత్తానికి తెలిసిన విషయమే. ఈ లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో ఎవరు ఇళ్ళల్లోంచి బయటకు రావద్దని, ప్రభుత్వం చెప్పిన విషయం చిన్న పిల్లవాడి నుండి పెద్దవారి వరకు తెలిసిందే.

♦️ఈ క్రమంలో విద్యుత్ శాఖ లీలలు ఎలా ఉన్నాయంటే... ఏప్రిల్ నెల విద్యుత్ బిల్లులు తీయకూడదు కరోనా ఉంది కాబట్టి ఎవరు విద్యుత్ బిల్లులు తీయకూడదని ఆదేశాలు జారీ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.

♦️ఆ క్రమంలో మార్చి నెలలో వచ్చిన విద్యుత్ బిల్లులను ఏప్రిల్ నెలలో కట్టుకోండి అని కూడా అధికారులు చెప్పారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే మే నెలలో వచ్చి విద్యుత్ శాఖా వారు  బిల్లు తీశారు. వచ్చిన బిల్లులో ఏప్రిల్ నెలలో వచ్చిన బిల్లును మినహాయించి మొత్తంమీద కలిపి రెండు నెలలకు మే నెలలో రీడింగ్ తీసి వెళ్లారు. అయితే ఏప్రిల్ నెలలో కట్టిన డబ్బు మినహాయించి ఏప్రిల్ నెలలో ఉన్న యూనిట్లు, మే నెలలో చూపించారు. సదరు అధికారులు ఏప్రిల్ నెల, మే నెలలో వచ్చిన యూనిట్లను యావరేజ్ చేయకుండా మే నెల ఒక్కదానికే చూపించారు సదర్ విద్యుత్ అధికారులు.
♦️రాష్ట్ర విద్యుత్ శాఖ వారి యాప్ APSPDCL లో ఏప్రిల్, మే నెలలో వచ్చిన రీడింగ్ ను యావరేజ్ చేయకుండా ఆ యూనిట్లన్నీ కేవలం మే నెలలో వాడుకున్నట్లు చూపించారు.

♦️దీంతో జగనన్న చేయూత పథకానికి తూట్లు పొడుస్తున్నారు ఆ విద్యుత్ శాఖా అధికారులు. మే నెలలో  మీకు 300 యూనిట్లు పైన కరెంటు బిల్లు దాటింది. 300 యూనిట్లకంటే ఎక్కువ రావడంతో పథకానికి దరఖాస్తు తీసుకోవడం లేదు అంటున్నారు పట్టణంలోని వాలంటీర్లు.

♦️కావున మీరు అర్హులు కారని చిలకలూరిపేట పట్టణంలోని వాలంటీర్లు చెప్పేసరికి జనం బిక్కముఖం వేసుకొని ఇదేదో విద్యుత్ మాయలా ఉందే.. విఠలా చార్యుని సినిమాలో మాయలా ఉందే అనుకుంటున్నారు.

♦️అప్పుడు విద్యుత్ అధికారులు  రెండు నెలల బిల్లు ఒకేసారి కట్టండి మేము యావరేజి చేస్తామని చెప్పారు. కానీ ఆ రెండు నెలల బిల్లులు యూనిట్లు యావరేజ్ చేయకుండా చేసేసరికి, ఈ పథకాలు ఏమి రాకుండా,  రేషన్ కార్డు తీసేసే అవకాశాలు ఉన్నాయని వార్డు వాలంటీర్లు చెబుతున్నారు.

♦️ఇదంతా తెలుసుకున్న పుర ప్రజలు లబోదిబో అంటున్నారు. మరి పథకాలు ఎగొట్టడానికి ఈ విధంగా మూడు వందల యూనిట్లు పైన రెండు నెలల యూనిట్లు కలిపి రేషన్ కార్డు తీసివేయటానికి చూపిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

♦️ఇది విద్యుత్ అధికారుల తప్పా... లేక ఇతర అధికారులు చేసిన తప్పా అనేది అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తేల్చాల్సిన సమస్య ఇది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో..? జగనన్న చేయూత పథకానికి గండి..? Rating: 5 Reviewed By: NEWS UPDATE