ఢిల్లీ: కొవిడ్-19 బారిన పడి లక్షణాలు లేనివారి సంఖ్య రోజు రోజుకూ అధికంగా ఉండటంతో గృహ ఏకాంతవాస విధానం(హోం ఐసొలేషన్)లో కేంద్ర ఆరోగ్య శాఖ చాలా వరకుమార్పులు చేసింది.
తాజాగా నేడు మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం లక్షణాల్లేని రోగులను స్వల్ప లక్షణాలున్న లేదా లక్షణాలు బయటపడక ముందు స్థాయి కేసుల జాబితాలో చేరుస్తారు. అయితే హెచ్‌ఐవీ, క్యాన్సర్ ఉన్నవారికి, ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన వారికి మాత్రం హోం ఐసొలేషన్‌కు అనుమతించరు.
60ఏళ్లు పైబడిన వారికి అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులతో (ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల సమస్యలు) బాధపడుతున్నవారికి రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులున్నవారికి మాత్రం వైద్యాధికారులు సమగ్రంగా పరిశీలించిన తర్వాతే హోం ఐసొలేషన్‌కు అనుమతిస్తారని కేంద్ర వైద్య శాఖ అధికారులు తెలిపారు.