728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 7, 2020

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు

విశాఖపట్నం జిల్లా:
 ★ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

★ హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎల్‌జీ పాలిమర్స్ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా 12 మందిని అరెస్ట్ చేశారు.

★ ఘటనపై అధ్యయనం చేసిన నీరబ్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని తేల్చింది.

★ విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి ప్రమాదకర స్టైరీన్ విషవాయువు లీకై 15 మంది మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టించింది.

★ తాజాగా, ఈ ఘటనలో పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు.

★ అరెస్ట్ అయిన వారిలో ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్ కి జియాంగ్, సంస్థ డైరెక్టర్ డీఎస్ కిమ్, అదనపు డైరెక్టర్ మోహన్ రావు ఉన్నారు.

★ ప్రమాదానికి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ నిందితులపై 304(2), 338, 285, 337, 284, 278 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అరెస్టైన వారి వివరాలు:
★ సుంకీ జియోంగ్, మేనిజింగ్ డైరెక్టర్, సీఈఓ

★ డీఎస్ కిమ్, టెక్నికల్ డైకెర్టర్

★ పిచ్చుక పూర్ణ చంద్ర మోహన్ రావ్, అడిషనల్ డైరెక్టర్ (ఆపరేషన్స్ విభాగం)

★ కోడి శ్రీనివాస్ కిరణ్ కుమార్, హెచ్ఓడీ, ఎస్ఎంహెచ్ ఇంఛార్జీ

★ రాజు సత్యనారాయణ, ప్రొడక్షన్ టీమ్ లీడర్

★ చెడుముపాటి చంద్రశేఖర్, ఇంజినీర్

★ కసిరెడ్ల గౌరీ శంకర నాగేంద్ర రాము, ఇంజినీర్

★ ముద్దు రాజేష్, ఆపరేటర్

★ పొట్నూరు బాలాజీ, నైట్ డ్యూటీ ఆఫీసర్ (ఆపరేషన్స్ విభాగం)

★ శిలపరశెట్టి అచ్యుత్, జీపీపీఎస్ ఇంఛార్జీ

★ కె. చక్రపాణి, ఇంజినీర్

★ కొండవలస వెంకట నరసింహ రమేశ్ పట్నాయక్, నైట్ షిఫ్ట్ సేఫ్టీ ఇంజినీర్
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు Rating: 5 Reviewed By: NEWS UPDATE