చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలం ఎండుగంపాలెం గ్రామంలో రెండు, తూబడు గ్రామంలో మూడు, చందవరం గ్రామంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం మీద ఈ రోజు నాదెండ్ల మండలంలో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తమ్మీద నాదెండ్ల మండలంలో ఈ రోజు వరకు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఒక వ్యక్తికి,మానుకొండ వారి పాలెం గ్రామంలో ఒకరికి, బొప్పూడి గ్రామంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే బొప్పూడి గ్రామంలో వచ్చిన రిపోర్టులు అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. మొత్తంమీద చిలకలూరిపేట మండలం లో ఈరోజు వరకు 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.