చిలకలూరిపేట: పట్టణంలో కరోనా రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటివరకు చిలకలూరిపేట పట్టణంలో 26వ తేదీన అత్యధికంగా 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం విధితమే.
అలానే చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు చిలకలూరిపేట పట్టణంలో నమోదైన అత్యధిక కేసుల్లో రెండో స్థానాన్ని ఆక్రమించింది. చిలకలూరిపేట పట్టణంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే కరోనా సోకిన వారికి సరైన సమయంలో టెస్ట్లు చేయ లేకపోవడం వల్ల టెస్ట్ చేయించుకున్న వారి రిపోర్టులు ఆలస్యంగా రావడం వల్ల ఈ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోందని అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పట్టణంలో టెస్ట్లు వేగవంతంగా చేసి వెంటనే రిజల్ట్ ఇస్తే ఈ కరోనా వ్యాప్తిని కొంతవరకైనా అరికట్టవచ్చని పలువురు తమ అభిప్రాయాన్ని తెలిపారు.
చిలకలూరిపేటలో ఈరోజు వివిధ ప్రాంతాల్లో నమోదైన 54 కరోనా పాజిటివ్ కేసులుతో ఇప్పటివరకు పట్టణంలో 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే సాయంత్రంలోపు 54 అంకె మారే అవకాశాలు కూడా ఉన్నాయి.