చిలకలూరిపేట: నియోజకవర్గంలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. నేడు మండలంలోని వేలూరు గ్రామంలో 11 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల 4 రోజుల క్రితం ఆ గ్రామంలో రికార్డు స్థాయిలో 20 కరోనా కేసులు నమోదైన విషయం విదితమే. వారికి సంబంధించి ప్రైమరీ కాంటాక్టులు అధికారులు పరీక్షలు నిర్వహించగా 11 కేసులు నమోదు కావడం విశేషం.
మానుకొండ వారి పాలెం గ్రామంలో ఒకరికి, కోమటినేనివారి పాలెం గ్రామంలో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే కోమటినేనివారిపాలెం గ్రామంలో వచ్చిన నాలుగు పాజిటివ్ కేసులను అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ఎడ్లపాడు మండల పరిధిలో ఇరువురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.