728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 30, 2020

కరోనాతో చిలకలూరిపేట పట్టణంలోని ఓ వ్యక్తి మృతి

చిలకలూరిపేట: కరోనా కాటుకు పట్టణంలోని ఒక వ్యక్తి బలయ్యాడు. చిలకలూరిపేట పట్టణంలోని RVS హై స్కూల్ రోడ్ లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి (60) ఈనెల 18వ తేదీన కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నాడు. 20వ తేదీన పాజిటివ్ రిపోర్ట్ రావటంతో సదరు వ్యక్తి తీవ్ర అనారోగ్యంగా ఉండటంతో ఈ నెల 24వ తేదీన కే.ఎం.సి లో చికిత్స నిమిత్తం చేరారు.

అయితే ఆ వ్యక్తి బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ వ్యక్తి పట్టణంలోని బోస్ రోడ్డులో ఐరన్ షాపు నిర్వాహకుడు. ఆ వ్యక్తి కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ రావటంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీంతో చిలకలూరిపేట పట్టణంలో కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వారి సంఖ్య సుమారు ఎనిమిది వరకు చేరింది. అయితే ఈ సంఖ్య అధికారికంగా అధికారులు ఇంకా దృవీకరించలేదు.

కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వారంతా వివిధ అనారోగ్య సమస్యల కారణంగా కరోనా పాజిటివ్ రావడంతో 50, 60, 70 సంవత్సరాల పైబడిన వారు మాత్రమే ఉన్నారు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉంటే కరోనాతో మృతిచెందరని వైద్యులు చెబుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనాతో చిలకలూరిపేట పట్టణంలోని ఓ వ్యక్తి మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE