728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 26, 2020

చిలకలూరిపేటలో కొత్తగా మరో 20 కరోనా కేసులు నమోదు... 70 కు చేరిన నేటి కేసుల సంఖ్య

చిలకలూరిపేట: పట్టణంలో  చాప కింద నీరులా కరోనా విస్తరిస్తుంది. ఇప్పుడు పట్టణం కరోనాకు హాట్ స్పాట్ గా మారిందని చెప్పవచ్చు.  నిన్నటి దాకా పట్టణంలో సుమారు 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ ఒక్కరోజు 70 కేసులు, రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

ఈనెల 19వ తేదీన రజక కాలనీలో నిర్వహించిన 200 మంది పరీక్ష ఫలితాల్లో నేడు 50 మందికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది.  నర్సారావుపేట మహాత్మా గాంధీ హాస్పిటల్ లో పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లి కోవిడ్ టెస్ట్లు చేయించుకున్న వారిలో  సుమారు 20 మందికి నేడు కరోనా పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. మొత్తం మీద ఈ రోజు చిలకలూరిపేట  పట్టణంలోనే 70 మందికి కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం సంఖ్య 234 కు చేరుకొగా జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

చిలకలూరిపేటలో 24వ తేదీ నుండి నెలాఖరు వరకు లాక్ డౌన్ అమలు చేశారు. అయితే లాక్ డౌన్ మరలా పొడిగించే అవకాశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. లాక్ డౌన్ పొడిగించకపోతే చిలకలూరిపేటలో రోజుకు వంద దాకా కేసులు నమోదు కావచ్చని కూడా చర్చ జరుగుతుంది.

20 కేసుల వివరాలు:
గాంధీ పేట            -  6
సుబ్బయ్య తోట    -  2
వెంకటాచారినగర్  -  4
జాగుపాలెం          -  2
సాలిపేట              -  2
కుమ్మరి కాలనీ      -  1
మద్ది నగర్           -  1
రాగన్నపాలెం        -  1
పసుమర్రు            -  1
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో కొత్తగా మరో 20 కరోనా కేసులు నమోదు... 70 కు చేరిన నేటి కేసుల సంఖ్య Rating: 5 Reviewed By: NEWS UPDATE