★ భారత్ ఎప్పుడూ స్నేహపూర్వక సంబంధాల కోసమే ప్రయత్నిస్తోంది అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
★ దేశ ప్రజలను ఉద్దేశించి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు.
★ జవాన్ల ధైర్యసాహసాలకు దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది.
★ అంతర్గత సంఘర్షణల నుంచి దృష్టి మరల్చేందుకు, భారత్ భూముల స్వాధీనం కోసం ఆనాడు పాక్ దురాలోచన చేసింది.
★ వైరస్‌పై పోరాటానికి మరింత సమర్థత అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలి.
★ కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంతో కరోనాను తరిమికొడదాం.
★ ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాలు చాలా తక్కువ.
★ కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదు అని మోదీ తెలిపారు.

