చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలంలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. యడ్లపాడు ప్రాథమిక వైద్యశాలలో 92 మందికి 18వ తేదీన కరోనా పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షల్లో ఒక్క యడ్లపాడు గ్రామంలోనే రికార్డు స్థాయిలో 21 కరోనా కేసులు నమోదయ్యాయి. లింగారావుపాలెం గ్రామంలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు తెలియజేసారు.
అయితే పరీక్షల నిమిత్తం స్వాబ్ నమూనాలను సేకరించి ఆరు రోజులు కావడంతో పాజిటివ్ వచ్చిన వారికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులు ఉన్నాయోనని అటు అధికారులు, ఇటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో మొత్తం మీద ఎడ్లపాడు మండల పరిధిలో ఇప్పటివరకు 76 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.