చిలకలూరిపేట: మండలంలోని కమ్మవారిపాలెం గ్రామంలో ఇరువురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మానుకొండవారిపాలెంలో మరొక వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీనితో చిలకలూరిపేట రూరల్ పరిధిలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెం గ్రామంలో అనారోగ్యంతో గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గత మూడు నెలల నుండి డయాలిసిస్ చేయించుకుంటున్న వ్యక్తి నిన్న మృతి చెందాడు.
ఆ వ్యక్తి రెండు మూడు రోజులకోసారి గుంటూరు వెళ్లి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. అయితే నిన్న తీవ్ర అస్వస్థతతో సదరు వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి మృతిచెందిన అనంతరం అతనికి రెండు రోజుల క్రితం తీసిన కోవిడ్ టెస్ట్ ఫలితం ఈ రోజు వచ్చింది. ఈరోజు అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు రిజల్ట్ రావడంతో అనారోగ్యంతో ఉండి కరోనా పాజిటివ్ వచ్చిన ఒక వ్యక్తి మృతి చెందినట్లు అయింది.