చిలకలూరిపేట: పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఇప్పటివరకు పట్టణంలో 146 కేసులు వచ్చాయని చిలకలూరిపేట ఇంటిగ్రేటెడ్ కంటైన్మెంట్ జోన్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలియజేశారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీ శుక్రవారం నుండి 31వ తేదీ వరకు చిలకలూరిపేటలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చిలకలూరిపేట టాస్క్ఫోర్స్ అధికారులు, శాసన సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశామని ఈ సమావేశంలో అందరూ తీర్మానించి జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు పరచాలని ఆయన అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, కార్యాలయాలు లాక్ డౌన్ ప్రకటించి వారి కార్యాలయాల వద్ద బోర్డులు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వారు సూచించారు.
కేవలం నిత్యావసరాలు అయిన పాలు, కూరగాయలు ఉదయం 9 వరకు మాత్రమే తెరవాలని, మెడికల్ షాపులు అత్యవసరం కావున వారికి రిలాక్సేషన్ ఇచ్చినట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు.