చిలకలూరిపేట: పట్టణంలో ఉదయం నుండి 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా నేడు పట్టణంలోని రాగన్నపాలెంలో మరో పాజిటివ్ కేసు నమోదయింది. రాగన్నపాలెంలో నివసిస్తున్న ఒక వ్యక్తి (34) మార్కెట్ సెంటర్లో ఫ్రూట్స్ అమ్ముకుంటూ ఉంటాడు. సదరు వ్యక్తి కరోనా పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో అతనిని అధికారులు కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించారు.
ఎడ్లపాడులో ఈరోజు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని కూడా కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించారు. మొత్తం మీద ఈ రోజు చిలకలూరిపేట పట్టణంలో 20 కేసులు, నాదెండ్లలో 3, ఎడ్లపాడు 3, నియోజకవర్గం మొత్తం మీద 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.