చిలకలూరిపేట: పట్టణంలో నేడు 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం విదితమే. అయితే పట్టణంలోని చలివేంద్ర బజార్ మూల మీద పిండిమర యజమాని రాగన్నపాలెంలో నివాసం ఉంటాడు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో పట్టణంలో ఈరోజు కరోనా కేసుల సంఖ్య 19కు చేరుకుంది.
నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఇరువురు వ్యక్తులకు కరోనా పాజిటివ్ రాగా చిరుమామిళ్ల గ్రామంలో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. నాదెండ్ల మండలంలో ఈనెల 13వ తేదీన వందమందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు.