728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 20, 2020

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టండి: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ ప్రాంతాల్లో కరోనా విజృంభన అధికంగా ఉందని, పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై  నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జిల్లా అధికారులకు వినతిని సమర్పించారు. సోమవారం కలెక్టర్, రూరల్‌ ఎస్పీ, స్పెషల్‌ కలెక్టర్లకు సత్వర చర్యలను వినతి ద్వారా తెలియజేశారు.

గత కొద్ది రోజులుగా చిలకలూరిపేట నందు పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నందున.. బాధితులకు చికిత్సనందించేందుకు ఆసుపత్రులను మరిన్ని గుర్తించాలని, ఐసోలేషన్‌ బెడ్స్‌ సంఖ్యను పెంచాలని, కరోనా నిర్ధారణ రాపిడ్‌ టెస్ట్‌లను అధికంగా నిర్వహించాలని కోరారు. లాక్‌డౌన్‌ విధించిన ప్రాంతాల్లో పటిష్ట చర్యలు అమలు చేయాలని, అనవసరంగా ప్రజలు తిరగకుండా చూడాలని, కంటైన్మెంట్‌ జోన్లలో పోలీస్‌ బందోబస్త్‌ను పెంచాలని విన్నవించారు. వినుకొండ, చిలకలూరిపేట, వినుకొండ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మరింతగా పెంచాలని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తక్షణ చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టండి: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు Rating: 5 Reviewed By: NEWS UPDATE